దేవుడు కనిపిస్తాడు.. | - | Sakshi
Sakshi News home page

దేవుడు కనిపిస్తాడు..

Jun 16 2026 1:46 AM | Updated on Jun 16 2026 1:46 AM

దేవుడు కనిపిస్తాడు..

బేతంచెర్ల: 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బేతంచెర్ల మండల పరిధిలోని అంబాపురం గ్రామం మీదుగా రూ. 5 కోట్ల ఎస్డీఎఫ్‌ నిధులతో శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ క్రాస్‌ రోడ్డు నుంచి శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఆలయం వరకు బీటీ రహదారి ఏర్పాటు చేసింది. కాని అంబాపురం గ్రామ సమీపంలో కిలోమీటర్‌ మేర ఫారెస్టులో ఉండటంతో అనుమతులు రాక రహదారి నిర్మాణం నిలిపేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి రాళ్లు తేలి ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శనివారం బనగానపల్లె వైపు నుంచి మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి ఈ రహదారి మీదుగా భక్తులు చేరుకుంటారు. రాళ్ల రహదారిలో ప్రయాణించలేక దేవుడా.. అంటూ నిట్టూర్చుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement