డీలరూ.. కంది పప్పు ఏదీ! | - | Sakshi
Sakshi News home page

డీలరూ.. కంది పప్పు ఏదీ!

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

బనగానపల్లె రూరల్‌: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీలోనూ కోత విఽధిస్తోంది. ప్రతి నెల పేదలకు చౌక దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధమ పిండి, జొన్నలు లేదా రాగులు అందజేయాల్సి ఉంది. అయితే రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం పంపిణీ తప్పా కంది పప్పు, జొన్నలు, రాగుల జాడ లేదు. అరకొరగా చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌక దుకాణాల్లో రూ. 67లకు కిలో కంది పప్పు ఇచ్చేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో పేదలు కొనలేనిస్థితిలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.125–150 వరకు ఽఉంది. పేదలకు సబ్సిడీపై అందజేయాల్సిన నిత్యావసర సరుకుల పంపిణీ నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బనగానపల్లె నియోజవర్గంలోని బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు, కొలిమిగుండ్ల సంజామల మండలాల్లో మొత్తం 193 రేషన్‌ దుకాణాల పరిధిలో 77,981 మంది రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్క కార్డుదారుడికి కిలో కందిపప్పును ప్రతి నెల సరఫరా చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని నెలలు మాత్రమే బియ్యంతో పాటు అరకొరగా కందిపప్పును సరఫరా అయ్యింది. గత సంవత్సరం నుంచి రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో చౌకదుకాణాల్లో కందిపప్పు ప్యాకెట్లు చూద్దామన్నా కనిపించడం లేదు. ఎప్పటి నుంచి ఇస్తారని కార్డుదారులు అడిగినా డీలర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.

చౌక దుకాణాల్లో బియ్యం,

చక్కెర మాత్రమే పంపిణీ

కందిపప్పు సరఫరాపై చేతులెత్తేసిన

కూటమి ప్రభుత్వం

మార్కెట్‌లో పెరిగిన ధరలతో

పేదలపై భారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement