జగనన్న హయాంలోనే గిరిజనులకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

జగనన్న హయాంలోనే గిరిజనులకు పెద్దపీట

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

జగనన్న హయాంలోనే గిరిజనులకు పెద్దపీట

గత ఐదేళ్ల జగనన్న పాలనలో గిరిజనులకు పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర అన్నారు. గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవితో పాటు నామినేటెడ్‌ పదవుల్లో, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించి గిరిజనులకు నిజమైన రాజ్యాధికారం అందించారన్నారు. మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఉమ్మడిగా ఉండేదని, అయితే జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించారన్నారు. నాడు జగనన్న ప్రతి తండాకు రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, విద్య సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.

ప్రీతిబాయి కేసుపై

ఎందుకు ప్రశ్నించవు..

సుగాలి ప్రీతిబాయికి అన్యాయం చేశారని, పవన్‌కల్యాణ్‌ ఆరోజు ఊగిపోయి మాట్లాడారని, ఈ రోజు సీబీఐకి కేసు విచారించడానికి తమవద్ద నిధులు లేవని, చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందదని వైఎస్సార్‌సీపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర విమర్శించారు. అదే వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రీతిబాయి కుటుంబానికి 5 ఎకరాల పొలం, 5 సెంట్ల స్థలం, తండ్రికి కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇవ్వడంతో పాటు కేసును సీబీఐకి ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. నేడు చంద్రబాబు ఈ కేసు పట్ల నోరు మెదపకున్నా నాడు ప్రశ్నించిన పవన్‌కల్యాణ్‌ నేడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలో 30 మంది గిరిజన చిన్నారులు చనిపోయినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. గిరిజనులకు 1.86 లక్షల మందికి 3 లక్షల ఎకరాల ఆర్వోఆర్‌ పట్టాలు, 25,573 మందికి 38,801 ఎకరాల డీకేటీ పట్టాలు నాడు జగన్‌ గిరిజనులకు అందించారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement