బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివారులోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసం శుభదినాలను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన, వివాహాల మొక్కులు, స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో క్షేత్రం జనసందోహంగా మారింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.


