పనుల్లో నిర్లక్ష్యం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. పనులు గడువులోగా పూర్తి కాలేదు. ఓ వైపు ఉత్సవాలు ప్రారంభమైనా ఇంకా పనులు కొనసాగు తున్నాయి. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ఉభయ దేవాలయాల్లో పెయింటింగ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో ముగ్గులకు పెయింటింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయి. అలాగే శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జర్మన్ షెడ్ల ఇంకా పూర్తి కాలేదు. క్యూలైన్ల ప్రవేశ మార్గాల వద్ద ఇనుప మెష్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంకా ఏర్పాటు చేయలేదు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికి ఏర్పాట్లు కొనసాగుతుండడంపై..ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


