శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మల్లన్న సమేత భ్రమరాంబ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు అందాయి. ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల ఆలయ చైర్మన్ రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు, వేదపండితులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు వస్త్ర సమర్పణ చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థాన ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్‌వీ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.


