సంకల్పదారులు | - | Sakshi
Sakshi News home page

సంకల్పదారులు

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

సంకల్పదారులు

సంకల్పదారులు

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కర్నూలు (సెంట్రల్‌): ‘చలో పోతిరెడ్డిపాడు’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సభ ఏర్పాట్లకు కృషి చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను బైరెడ్డి పరిశీలించారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పార్టీలో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఆత్మకూరులో భోజన వసతిని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

రైతుల ‘సునామీ’

భారీగా తరలివచ్చిన రాయలసీమ రైతులు

జూపాడుబంగ్లా: ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు రైతులు సునామీలా తరలివచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టుపెట్టి సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేందుకు చేపట్టిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సభ విజయవంతం కాకుండా చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నినా ఫలితం లేకుండా పోయింది. సభ నిర్వహణకు కేవలం 18గంటల ముందు మాత్రమే అనుమతులు మంజూరైనా వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంటు బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్‌ నిర్ణీత సమయానికి సభను ముస్తాబు చేయించారు. అంచనాలను మించిపోయి రాయలసీమ జిల్లాల నుంచి 10 వేల మందికిపైగా రైతులు తరలివచ్చారు. ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2.30గంటల వరకు కొనసాగింది. అప్పటిదాకా సభా ప్రాంగణానికి సుదూర ప్రాంతాల్లోని రైతులు తరలివస్తూనే ఉన్నారు. రైతులు, ప్రజలు సభాప్రాంగణం వద్దకు మినహా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, రాయలసీమ ఎత్తిపోతల పథకం చూసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రైతులు పోలీసుల వైఖరిని తప్పుపడుతూ వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement