సీమకు ఎత్తిపోతల పఽథకాలతోనే న్యాయం
ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ బహిరంగ సభ
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్రంలో పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు
కర్నూలు(టౌన్): ‘‘సీమ ప్రజలకు సాగు, తాగునీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు. తెలంగాణతో కుమ్మక్కయ్యాడు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే ప్రారంభించాలి. లేకపోతే రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సీమ ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రేటర్ రాయలసీమకు చెందిన అన్ని జిల్లాల రైతులు, ప్రజలు కలిసి వచ్చే నెల 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. గురువారం కల్లూరులోని నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం రాయలసీమలో వర్షపాతం కూడా తక్కువేనన్నారు. ఈ కారణంగా ప్రతి ఏటా వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రాయలసీమలో ప్రాజక్టుల పట్ల ఈ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష పార్టీగా రాయలసీమ ప్రాంతంలో వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించేంత వరకు ఉద్యమబాట పడుతున్నట్లు స్పష్టం చేశారు.
రేవంత్ వ్యాఖ్యాలపై నోరు మెదపరేం?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నాలుగు గోడల మధ్య చంద్రబాబుతో కలిసి రాయలసీమలో లిఫ్ట్ పనులు నిలిపివేసినట్లు ప్రకటించారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. సీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ఈ వాఖ్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో లిఫ్ట్ పనులు పూర్తయితే సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగుతాయన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ పనులు నిలిపివేశారన్నారు. సమావేశంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి(శ్రీశైలం), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కంగాటి శ్రీదేవి(పత్తికొండ), కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకా, నందికొట్కూర్ ఇన్‌చార్జి దారా సుధీర్, ఆదిమూలపు సతీష్(కోడుమూరు), రాజీవ్ రెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి (ఎమ్మిగనూరు), పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ పాల్గొన్నారు.
ఆశలను ‘నీరు’గార్చారు
మాజీ మంత్రి బుగ్గన,
కాటసాని రాంభూపాల్ రెడ్డి వెల్లడి
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని
నిరసిస్తూ రైతులు భారీగా రావాలి
లేదంటే రాయలసీమ ఎడారిగా
మారుతుంది
శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల
నీరు చేరకముందే తెలంగాణకు
తరలిస్తున్నారు
రాయలసీమకు న్యాయం జరగాలంటే ఎత్తిపోతల పథకాలతోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు సీమ ప్రజలకు అన్యాయం చేశాడని విమర్శించారు. ఆయన హయాంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించలేదన్నారు. మళ్లీ 2014–19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మరోసారి సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో సాగునీటి ప్రాజక్టులు, ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన హయాంలో సీమ ప్రాంత అభివృద్ధికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు నీరు చేరక ముందే తరలిస్తున్నారన్నారు. దీన్ని అధిగమించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారన్నారు. 22 టీఎంసీలు సీమకు రావాలని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయకపోతే కరువుతో సీమ ప్రాంతం అల్లాడుతుందన్నారు.
సీమకు ఎత్తిపోతల పఽథకాలతోనే న్యాయం
సీమకు ఎత్తిపోతల పఽథకాలతోనే న్యాయం


