15 నిమిషాలకే రిజిస్ట్రేషన్
కర్నూలు (సెంట్రల్): నాట్ బుకింగ్ విధానంతో 15 నిమిషాలకే రిజిస్ట్రేషన్ పత్రిక ముగుస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్ కుమార్ విక్రయదారులకు సూచించారు. గురువారం ఆయన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు విక్రయదారులకు 15 నిమిషాలకే పూర్తయిన రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేయాలన్నారు. ఆయన వెంట కర్నూలు సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు, కల్లూరు సబ్ రిజిస్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.


