స్పర్శ దర్శనానికి నిర్దిష్ట వేళలు
శ్రీశైలం: భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా స్పర్శ దర్శనానికి నిర్దిష్ట వేళలను నిర్ణయిస్తూ సామాన్య భక్తులు అలంకార దర్శనం చేసుకోవడానికి వీలుగా శ్రీశైల దేవస్థానం ట్రస్టు బోర్డు నిర్ణయించింది. గురువారం చైర్మన్ రమేష్‌నాయుడు అధ్యక్షతన ఈఓ శ్రీనివాసరావు, సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మొత్తం 42 అంశాలు చర్చకు రాగా 39 అంశాలు ఆమోదించారు. రెండింటిని వాయిదా వేయగా, ఒక అంశాన్ని తిరస్క రించారు. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళల్లో ఉదయం, రాత్రి మా త్రమే కల్పించేందుకు నిర్ణయించారు. మిగిలిన సమయమంతా అలంకార దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
జనరల్ డ్యూటీ అటెండెంట్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల భర్తీకి 2024 జనవరి 29న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి జనరల్ డ్యూటీ అటెండెంట్(21 ఖాళీలను) అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 19, 20వ తేదిల్లో నిర్వహించామన్నారు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఫేస్–2ను కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్‌లు https://kurnool. ap.gov.in, https://nandyal.ap.gov.inతో పాటు https://kurnool medicalcollge.ac.inలో అప్‌లోడ్ చేశామన్నారు.


