ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు అభివృద్ధి విషయంలోనూ అభాసుపాలవుతున్నారు. తాము ఏమి చేశామో చెప్పుకోలేక.. గత ప్రభుత్వంలో చేపట్టిన, కొనసాగుతున్న పనులకు మళ్లీ భూమి పూజ చేస్తూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో | - | Sakshi
Sakshi News home page

ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు అభివృద్ధి విషయంలోనూ అభాసుపాలవుతున్నారు. తాము ఏమి చేశామో చెప్పుకోలేక.. గత ప్రభుత్వంలో చేపట్టిన, కొనసాగుతున్న పనులకు మళ్లీ భూమి పూజ చేస్తూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

Jan 4 2026 6:58 AM | Updated on Jan 4 2026 6:58 AM

ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల

ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల

వైఎస్సార్‌సీపీ పనులకు ఎమ్మెల్యే అఖిల మళ్లీ పూజలు

అదే స్థలం.. ఆయనే పూజారి

గతంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేసేందుకు తీసుకున్న అదే స్థలంలో భూమి పూజ చేయడంతో పాటు అప్పుడు వచ్చిన పూజారి వేద మంత్రోచ్ఛారణలతోనే ఎమ్మెల్యే అఖిలప్రియ మళ్లీ భూమి పూజ చేయించారు. ఈ దృశ్యాలను చూసిన గ్రామస్తులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలు సైతం ముక్కున వేలేసుకున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు ప్రభుత్వం గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాల వరుస క్రెడిట్‌ చోరీకి పాల్పడుతోంది. అధినేత దారిలోనే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా పయనిస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు అప్పట్లోనే భూమిపూజ చేసి నిర్మాణ పనులను మొదలు పెట్టడం, పనులు కూడా చకచకా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఆసుపత్రి భవనాలకు అమ్మ కల అంటూ వారం రోజుల క్రితం తామే మంజూరు చేయించి పనులు పూర్తి చేసినట్లు గొప్పకుపోయి మళ్లీ ప్రారంభించడంతో జనం నవ్వుకున్నారు. ఇది మరువక ముందే తాజాగా శనివారం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలోనే భూమిపూజ చేసిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు హడావుడిగా మళ్లీ భూమి పూజ కార్యక్రమం చేపట్టడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.

2024 మార్చి 8న భూమి పూజ

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రుద్రవరం మండలంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆలమూరు, రుద్రవరం సబ్‌స్టేషన్‌లలో లోడు మళ్లించే విధంగా తిప్పారెడ్డిపల్లె సమీపంలో 33/11 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఇదే సమయంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టేందుకు రైతు స్థలాన్ని దాత రామణయ్యతో మాట్లాడి ఒప్పించారు. ఈ మేరకు 2024 మార్చి 8న సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు అప్పటి విద్యుత్‌ శాఖ ఇంజినీర్‌లు రమణారెడ్డి, రవికాంత్‌, రాజేశ్‌, రాఘవేంద్రారెడ్డిలతో భూమి పూజ కూడా చేయించారు.

స్తంభాలు కూడా ఏర్పాటు

రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనుల్లో భాగంగా 33/11 స్తంభాలు సుమారు 300 దాకా పాతించడం పూర్తయింది. సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టేలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో ఆలస్యమైంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా నిధులు విడుదల చేయకుండా తొక్కిపెట్టి ఇప్పుడు మళ్లీ భూమి పూజ చేయడం ఏంటని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాల

విషయంలోనూ అదే ధోరణి

పూర్తయిన పనులు

తమ ఘనతగా ప్రచారం

తాజాగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు

భూమి పూజ

ఈ పనులు గత ప్రభుత్వంలోనే మొదలు

ఇప్పటికే 11కేవీ 300 స్తంభాలు

పాతడం పూర్తి

నవ్వులపాలవుతున్న

టీడీపీ ఎమ్మెల్యే తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement