కృషి, పట్టుదలతో విజయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): కృషి, పట్టుదల ఉంటే విద్యార్థులు విజయం సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బొమ్మలసత్రం సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, వారి అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 281 పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. తనకు కేటాయించిన ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించానన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ నిత్యానంద రాజు, ప్రిన్సిపాల్ పీఎన్ మల్లికార్జునప్ప పాల్గొన్నారు.


