వచ్చేనెల 13న మెగా జాతీయ లోక్ అదాలత్
నంద్యాల(వ్యవసాయం): మెగా లోక్ అదాలత్‌ను డిసెంబర్ 13న నిర్వహించనున్నారని, విజయవంతం చేయాలని న్యాయవాదులకు మూడో అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. స్థానిక కోర్టు హాల్‌లో న్యాయవాదులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, కంపెనీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.


