దొంగ దొరికాడు
వెలుగోడు: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సురేష్ కథ నం మేరకు.. గాంధీనగర్‌కు చెందిన కుప్పల రమణయ్య పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో పానీపూరి బండి పెట్టుకొని జీవ నం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు రమణయ్య, అతని భార్య ఇంటి నుంచి సెంటర్‌కు వెళ్లి పానీపూరి బండి ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి, బీరు వాను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.60 వేల నగదు, 24 గ్రాముల బంగారు నెక్లెస్ (విలువరూ.1,35,000), రూ. 3000 విలువైన సెల్ ఫోన్ ఇలా మొత్తం రూ. 1,98,000 విలువ గల సొత్తు అపహరించారు. బాధితు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టగా శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో వెలుగోడు గ్రామ శివారులోని ఎస్‌ఎన్‌ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించా డు.అతని వద్ద నుంచి నగదు, నక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆత్మకూ రు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


