
గతంలో ఈ పరిస్థితి లేదు
ఎరువుల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం
రైతులు వ్యవసాయ కార్యాలయాల ముట్టడి
అధికారుల తీరుపై మండిపాటు
నెల రోజులుగా ఎదురు చూస్తున్నా
జగనన్న పాలనలో ఐదేళ్లు యూరియా కోసం ఏ రోజు కూడా పడిగాపులు కాయలేదు. గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సరిపడ యూరియా సరఫరా చేయాలనే ఆలోచన అధికారులు, కూటమి నాయకులకు లేదు. పది ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను. ఇంత వరకు బస్తా ఎరువు కూడా ఇవ్వలేదు. – సలీంబాషా, శాతనకోట గ్రామ రైతు
నందికొట్కూరు: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలల పూర్తి కావస్తున్నా ఎరువుల కొరత వేధిస్తోండటంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. సకాలంలో ఎరువులు సరఫరా చేసి ఆదుకోవాల్సిన కూటమి ప్రభు త్వం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అరకొరగా వచ్చిన వాటిని కూటమి నేతలు మార్గమధ్యలోనే పక్కాదారి పట్టిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. మంగళవారం మండల పరిధిలోని అల్లూ రు రైతు సేవా కేంద్రం, నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద రైతు లు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. నెల రోజుల క్రితం వ్యవసాయ అధికారులు యూరియా కోసం టోకెన్లు ఇచ్చినా ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఈ క్రమంలో నందికొట్కూరు వ్యవసాయ అధికారి షెక్షావలి రైతులను దుర్భాషలాడడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటూ రైతులను చలకనగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కూటమి నేతలు, వ్యవసాయ అధికారులు కుమ్మకై బ్లాక్‌లో యూరియా విక్రయిస్తుంటే పోలీసులు పట్టుకోవడం వాస్తవం కాదా.. అంటూ మండిపడ్డారు.
నందికొట్కూరులో ఏఓ షెక్షావలిని నిలదీస్తున్న రైతులు అల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న అన్నదాతలు
15 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. పిరికెడు యూ రియా వేయకపోతే దిగుబడి ఎలా వస్తుంది. ఇప్పడు, అప్పుడు అంటూ రోజు రైతు సేవా కేంద్రం, సహకార సొసైటి కేంద్రాల వద్దకు తిప్పుతున్నారు. నెల రోజుల క్రితం రెండు బస్తాలకు స్లిప్‌లు ఇచ్చారు. ఇంత వరకు ఒక బస్తా ఇవ్వలేదు. యూరియా రైతులకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. – సురేష్, శాతనకోట గ్రామం

గతంలో ఈ పరిస్థితి లేదు

గతంలో ఈ పరిస్థితి లేదు

గతంలో ఈ పరిస్థితి లేదు

గతంలో ఈ పరిస్థితి లేదు