ఎన్‌హెచ్‌ఎం పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

నల్లగొండ టౌన్‌ : వైద్యారోగ్య శాఖ పరిధిలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 65 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రొవిజినల్‌ మెరిట్‌ మార్కుల జాబితాను విడుదల చేసి www.nalgonda.telangana.gov.in వెబ్‌సైట్‌తోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని నోటీస్‌ బోర్డుపై ఉంచినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.రాహుల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 19న సాయంత్రం 5 గంటల్లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా అందజేయాలని పేర్కొన్నారు.

ఏదుల నుంచే నీరివ్వాలి

నల్లగొండ టౌన్‌ : రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించిన విధంగానే ఏదుల రిజర్వాయర్‌ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీరివ్వాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నేత నంద్యాల నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు బహిరంగ లేఖ రాశారు.

ప్రతిభను వెలికితీసేందుకే క్రీడా పోటీలు

ఫ తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి

మిర్యాలగూడ : యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి మెన్‌, ఉమెన్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌లతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌వీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నూకల వేణుగోపాల్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, నాయకులు గుడిపాటి నవీన్‌, ఆడోతు అశోక్‌నాయక్‌ పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లు

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లిలోని శ్రీవారిజాల వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు దేవాలయ అనువంశిక చైర్మన్‌ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తెలిపారు. ఆలయ సముదాయాన్ని రాష్ట్రస్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో పర్యాటక పరంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరెంట్‌ కష్టాలు

నకిరేకల్‌(శాలిగౌరారం): కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరెంట్‌ కొరత ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శాలిగౌరారం మండలం రామగిరిలో సర్పంచ్‌ చాడ చంద్రకళ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో 72 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయలేకపోయిందన్నారు. దాంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించి రైతుల పంటలను ఎండబెట్టిన పాపం సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అయితగోని వెంకన్న, ప్రధాన కార్యదర్శి చాడ హతీష్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement