పెన్షనర్ల బకాయిలు ఒకేసారి చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల బకాయిలు ఒకేసారి చెల్లించాలి

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

నల్లగొండ టౌన్‌: పెన్షనర్ల బకాయిలు ఒకేసారి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని పెన్షనర్ల సామాజిక సేవా భవన్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈహెచ్‌ఎస్‌ ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఇబ్బందు లేకుండా కార్పొరేట్‌తోపాటు ఇతర ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలు అందించాలన్నారు. 2024 జూలై 1 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను సీనియారిటీ ప్రాతిపదికన చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం సభ్యత్వ నమోదులో నల్లగొండ జిల్లా కమిటీ రాష్ట్రంలోనే ముందంజలో ఉందని ప్రశంసించారు. ఇందుకు కృషిచేస్తున్న గుంతకండ్ల దామోదర్‌రెడ్డి, గానూతుల వెంకటరెడ్డి, గాయం నారాయణరెడ్డిలను అభినందించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్‌, ఆర్థిక కార్యదర్శి యాదగిరి, భవన కమిటీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కృష్ణయ్య, ప్రచార కార్యదర్శి శంకర్‌రెడ్డి, కోర్‌ కమిటీ చైర్మన్‌ రామలింగం, మండల అధ్యక్షుడు సత్యం, కార్యదర్శి వాసుదేవ్‌, ఆర్థిక కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement