సెలవుల్లో ఆనందాల చదువు | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ఆనందాల చదువు

Oct 17 2026 8:00 AM | Updated on Oct 17 2026 8:00 AM

పెద్దవూర : దసరా సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్‌లు, టీవీలతో సమయం వృథా చేయకుండా ఆనందంగా కొత్త విషయాలు నేర్చుకునేలా విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్‌టీ సరికొత్త డిజిటల్‌ చొరవకు శ్రీకారం చుట్టాయి. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ‘జాయ్‌ ఆఫ్‌ హాలిడే లెర్నింగ్‌’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. చదువును భారంగా కాకుండా, ఆస్వాదిస్తూ నేర్చుకునేలా దీనిని రూపొందించారు.

ఆడుతూ పాడుతూ.. కోడింగ్‌, మ్యాథ్స్‌

ఈ కార్యక్రమం ప్రధానంగా ‘కోడ్‌మిత్ర’ ప్లాట్‌ఫారంతో అనుసంధానమై ఉంటుంది. విద్యార్థులు తమ పెన్‌ నంబర్‌ ఉపయోగించి లింక్‌ ద్వారా లాగిన్‌ కావాలి. భవిష్యత్‌లో జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా మ్యాథ్స్‌ క్విజ్‌లు, కోడింగ్‌ యాక్టివిటీస్‌ ఇందులో పొందుపరిచారు. గణితాన్ని కష్టంగా కాకుండా సరదా ఫజిల్స్‌, గేమ్స్‌ రూపంలో నేర్పుతారు. చిన్న వయసు నుంచే లాజికల్‌ థింకింగ్‌ పెంపొందించే కోడింగ్‌ ఆటలు ఉంటాయి.

ఇంటి దగ్గరే ప్రయోగాలు

పుస్తకాలకే పరిమితం కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చిన్నచిన్న సైన్స్‌ ప్రయోగాలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. సెలవుల్లో పాఠశాలకు దూరమవ్వడం వల్ల పిల్లల్లో చదువుపై శ్రద్ధ తగ్గే (లెర్నింగ్‌ లాస్‌) ప్రమాదం ఉంది. దీనిని నివారించి, వారిలో నిరంతర అభ్యాస ప్రక్రియను కొనసాగించేలా ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

ఉపాధ్యాయుల పర్యవేక్షణ..

పిల్లలు ఏమేం నేర్చుకుంటున్నారు, వారి ప్రగతి ఎలా ఉందో పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక లాగిన్‌, ట్రాకింగ్‌ సదుపాయం కల్పించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంది.

ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా..

ఫ ‘జాయ్‌ ఆఫ్‌ హాలిడే లెర్నింగ్‌’ పోర్టల్‌

ఫ ఎస్‌సీఈఆర్‌టీ, విద్యా శాఖ సరికొత్త ప్రోగ్రామ్‌

ఫ ఆటల రూపంలో కోడింగ్‌, మ్యాథ్స్‌ పాఠాలు

ఫ 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement