ఫార్మర్‌ రిజిస్ట్రీకి స్పెషల్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీకి స్పెషల్‌ డ్రైవ్‌

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

విధిగా రిజిస్ట్రీ చేయించుకోవాలి

ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్న స్పెషల్‌ డ్రైవ్‌లో రైతులు విధిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. చేయించుకోని రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించవు. అధికారులకు రైతులు సహకరించి వందశాతం రిజిస్ట్రీ పూర్తిచేసేలా చూడాలి.

– వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

నల్లగొండ అగ్రికల్చర్‌ : రైతులందరి చేత ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంగళవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. ఈ నెల 30వ తేది వరకు గడువు విధించింది. ఉదయం 8 గంటల వరకు వ్యవసాయ అధికారులు గ్రామాలకు చేరుకుని రిజిష్ట్రేషన్‌ చేయించని రైతులను గుర్తించి రిజిస్ట్రీ చేయించనున్నారు. దీంతో పాటు మీసేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు చేయించుకునే అవకాశం కల్పించారు.

5,68,711 మంది రైతులకు..

కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరిలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ప్రతి రైతు భూమి వివరాలను ఫోన్‌ నంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 మండలాల్లో 5,68,711 మంది రైతులు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను కలిగి ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 71 శాతం మంది మాత్రమే రిజిస్ట్రీ పూర్తి చేసుకున్నారు.

పథకాలకు రిజిస్ట్రీ ఐడీ తప్పనిసరి

ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్పిడీ పథకాలతో పాటుగా యాప్‌ ద్వారా ఎరువులను పొందాలన్నా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అదేవిధంగా వానాకాలం, యాసంగి సీజన్లలో పండించిన పంటల అమ్మకాలు, పంట రుణాలను పొందాలన్నా ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి. ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి కూడా ఫార్మర్‌ ఐడీని అనుసంధానం చేసే అవకాశం లేకపోలేదు.

ఫ ఏడాదిన్నర గడిచినా 71 శాతమే..

ఫ నెలాఖరు వరకు పూర్తిచేయాలని లక్ష్యం

ఫ క్షేత్ర స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్న

వ్యవసాయ శాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement