ఫుల్‌ జోష్‌లో... | - | Sakshi
Sakshi News home page

ఫుల్‌ జోష్‌లో...

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

భిన్నమైన ప్రేమకథ
ఆ విజయం కొనసాగాలి

శ్రీని, వివేక్‌ ఆత్రేయ, రవితేజ, లక్ష్మణ్‌

మంగా శ్రీనివాస్‌, పూరి జగన్నాథ్‌, హేమారావు

‘ఇరుముడి’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. రవితేజ హీరోగా హసిత్‌ గోలి డైరెక్షన్‌లోని సినిమా ప్రకటన ఈ వారంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న మూవీని ప్రకటించారు. బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌పై లక్ష్మణ్‌, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఇరుముడి’తో సూపర్‌ హిట్‌ అందుకున్న రవితేజను లక్ష్మణ్‌, శ్రీని కలిసి అభినందించి, ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘రవితేజ ఎనర్జీ, స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. వివేక్‌ ఆత్రేయ తనదైన శైలిలో రూపొందించే కొత్త ప్రపంచంలోకి రవితేజ అడుగు పెట్టనున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

శ్రవణ్‌, మలైకా టి. వాసుపల్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘చకోర: లూనార్‌ లవ్‌ బర్డ్‌’. దర్శకుడు పూరి జగన్నాథ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన మంగా శ్రీనివాస్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్‌ ఐకానిక్‌ పిక్చర్స్‌ సారథ్యంలో డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన లవ్‌స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త లవ్‌ ఫీల్‌ను అందిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ప్రిన్స్‌ హెన్రీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement