చౌటుప్పల్ : రాఖీ పండుగ నేపథ్యంలో చౌటుప్పల్‌లోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ కొనసాగింది. వాహనాలు కిలోమీటర్ల మేరకు జామ్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ నుంచి సాధారణ రోజుల్లో బస్సులు గంట, కార్లు 45నిమిషాల్లో చౌటుప్పల్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం ఏర్పడిన రద్దీ కారణంగా బస్సులు రెండు నుంచి రెండున్నర గంటలు, కార్లు గంటన్నరకు చేరుతున్నాయి.
హైదరాబాద్ మార్గంలో
బారులుదీరిన వాహనాలు


