శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ కల్పిత గ్రామంలో 1960 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గంగ పాత్రలో శర్వానంద్, సులోచనగా అనుపమ, మందారంగా డింపుల్ హయాతి కనిపిస్తారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా ‘భోగి’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘మా గంగ ఆత్మ ఇది. ఐదుగురు సోదరీమణులు... ఒకే ప్రపంచం... ఒకే హృదయ స్పందన’’ అంటూ ఈ పోస్టర్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’లో సంపత్ నంది పేర్కొన్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


