నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రిజిస్ట్రీ ప్రారంభించి 14 నెలలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు 70 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గుర్తింపు కార్డులో 11 అంకెల యూనిక్ ఐడీ కేటాయించనుంది.
కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పని సరి
జిల్లాలో 5,68,711 మంది రైతులకు గాను.. 3,90,786 మంది రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఇంకా 1,77,925 మంది రైతులు నమోదు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్‌కార్డ్, ఫసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. భవిష్యత్‌లో ఎరువులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ నెల 31 వరకు గడువు ఉన్నందున రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ కోరుతుంది.
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలు..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో రైతులకు 11 అంకెల యూనిక్ ఐడీ కార్డు వస్తుంది. దీంతో రైతుల భూముల వివరాలు, నేల స్వభావం, సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంటల వివరాలు ఇలా రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వివరాలన్నీ ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తుండడంతో ఒక్క క్లిక్‌తో రైతుల వివరాలు చూసే అవకాశం ఉంటుంది.
జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ 70 శాతమే..
ఫ ప్రభుత్వ పథకాలు అందాలంటే రిజిస్ట్రీ తప్పనిసరి
ఫ 31తో ముగియనున్న గడువు
ఫార్మర్ రిజిస్ట్రీ వివరాలు
మొత్తం రైతులు 5,68,711 మంది
ఫార్మర్ రిజిస్ట్రీ
చేసుకున్నవారు 3,90,786
చేసుకోనివారు 1,77,925


