డిండి : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా పశుపోషణలో రైతులు మెలకువలు పాటించాలని జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రమేష్ సూచించారు. మంగళవారం డిండి మండల పరిధిలోని గోనకొల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులోఆయన మాట్లాడారు. వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పశువైద్యాధికారులు ధనలక్ష్మి, నాగయ్య రైతులకు పలు సూచనలు చేసి ఉచితంగా ఖనిజ లవణ మిశ్రమాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, రవి, తేజునాయక్, విజయేందర్‌రెడ్డి, రైతులు రాములు, రాకేష్‌రెడ్డి, నిరంజన్, చంద్యానాయక్, శివ, జనార్దన్‌రెడ్డి, లక్ష్మయ్య, గోపాల మిత్రలు తదితరులు పాల్గొన్నారు.


