ఆరుతడి పంటలు వేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు వేసుకోవాలి

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

రామగిరి(నల్లగొండ) : ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన శ్రీరైతు నేస్తం 100వ ఎపిసోడ్ఙ్‌ కార్యక్రమంలో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవగా, నల్లగొండ మండలం దోమలపల్లి రైతువేదిక నుంచి కలెక్టర్‌, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం తక్కువగా ఉందన్నారు. దీని ప్రభావంతో నాగార్జునసాగర్‌, ఏఎంఆర్‌పీ కాల్వలకు నీరు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీపై బిందు సేద్యం (డ్రిప్‌) పరికరాలను అందజేస్తోందని, రైతులు ఉద్యాన పంటలు, కూరగాయలతో పాటు సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల సాగును చేపట్టాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పలు గ్రామాల్లో పర్యటించారు దీపకుంటలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను సందర్శించి, సాగు విధానాలు, దిగుబడి, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులతో మాట్లాడారు. కంచనపల్లిలో కంది పంటను పరిశీలించి, సాగులో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. చర్చించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా హార్టికల్చర్‌ డీడీ శేఖర్‌ పాల్గొన్నారు.

బీఎల్‌ఓల విధులను పర్యవేక్షించాలి

నల్లగొండ : సర్‌ ప్రక్రియలో బీఎల్‌ఓలు చేస్తున్న పనులను తహసీల్దార్లు పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సర్‌పై ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. వీఐపీ ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు ఈ నెల 25లోపు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement