సొంతంగా సన్నద్ధమై..
కొండమల్లేపల్లి: రోజుకు 14 గంటల ప్రిపరేషన్, తల్లిదండ్రుల ప్రోత్సాహం గ్రూప్ –1లో సెలెక్ట్ అయ్యేలా చేసింది. కొండమల్లేపల్లికి చెందిన ఎల్లెబోయిన రుచిత టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన ఎల్లెబోయిన రవి, శోభ దంపతుల కుమార్తె రుచిత తన ప్రాథమిక విద్యాభ్యాసం కొండమల్లేపల్లిలోనే కొనసాగింది. డిగ్రీ అనంతరం ఢిల్లీలో ఆరు నెలల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తరువాత హైదరాబాద్‌లో ఉంటూ సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఉద్యోగ నియామకంలో రుచిత జనరల్ ర్యాంకింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది.
ప్రజలకు సేవ చేస్తా..
చిన్ననాటి నుంచి కలెక్టర్ కావాలనే ఆశయంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో ఒక అవగాహన వచ్చింది. స్వతహాగా గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తాజాగా వెలువడిన గ్రూప్–1 జనరల్ ర్యాంకింగ్స్‌లో 47వ ర్యాంక్ సాధించడం పట్ల సంతోషంగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నాను. ఏదేమైనా ఉద్యోగంలో చేరాక నావంతుగా పేదలకు సేవ చేస్తా.
– ఎల్లెబోయిన రుచిత


