నీలగిరిని సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిన నీలగిరిని సూపర్ స్మార్ట్ సిటీ చేయడమే ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో రూ.2,236.29 కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. రూ.216.19 కోట్లతో చేపట్టిన అమృత్ పథకం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నూతన ఎస్‌టీపీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు కొత్త పైపులైన్ వేయిస్తున్నట్లు తెలిపారు. అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణాల కోసం టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.53 కోట్లు కేటాయించామన్నారు. ఎస్‌డీఎఫ్ ఫండ్స్ రూ.109.21 కోట్లతో పట్టణంలో అంతర్గత రోడ్లు, వరద కాల్వల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రూ.545 కోట్లతో పానగల్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ వరకు జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయని, ఎస్‌ఎల్‌బీసీ నుంచి అద్దంకి–దుప్పలపల్లి రోడ్డు వరకు రూ.250 కోట్లతో నూతన రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ఎంజీ యూనివర్సిటీలో రూ.250 కోట్లతో కొత్త భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు తాగునీటి సరఫరాకు రూ.125 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. లతీఫ్‌సాహెబ్, బ్రహ్మంగారి గుట్టల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు.
తొలి మేయర్ అదృష్టలక్ష్మి..
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పదవి మహిళకు రిజర్వు అయ్యిందని, మేయర్ పదవి దక్కించుకునేవారు అదృష్టలక్ష్మి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మున్సి పల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్యనాయకులు పాల్గొన్నారు.
ఫ రెండు సంవత్సరాలలో
రూ.2,236.29 కోట్లతో అభివృద్ధి
ఫ ఇంటింటికీ తాగునీరందిస్తాం
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నీలగిరిని సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా


