19 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ
నల్లగొండ : నూతన సర్పంచ్‌లకు ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఐదు విడతల్లో ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డీపీఓ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ, డీఆర్డీఓ సమావేశ మందిరాల్లో ఈ శిక్షణ తరగతులు ఉంటాయని, సర్పంచ్‌లు విధిగా హాజరు కావాలని కోరారు.
విధుల్లో అలసత్వం వద్దు
మర్రిగూడ(చింతపల్లి) : వైద్యులు, సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహించవద్దని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన చింతపల్లి మండలంలోని గడియగౌరారం పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానాలో అందుతున్న వైద్య సేవలతోపాటు మందుల వివరాలు, రిజిస్టర్లు పరిశీలించారు. పిల్లలకు అందుతున్న వ్యాదినిరోదక టీకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాహుల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, పల్లె దవాఖానా ఎంఎల్‌హెచ్‌పీ మనీషా, హెల్త్ అసిస్టెంట్ జనార్దన్, ఏఎన్‌ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలి
నల్లగొండ : సీఎం కప్ పోటీలు విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, ఎంఈఓలు, పీడీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా తయారు చేయాలని సూచించారు. క్రీడాకారులకు అవసరమైన మైదానాలు, వసతులు, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. సీఎం కప్ పోటీల ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
19 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ


