తనయుడికి ఓటెయ్యాలని తండ్రి ప్రచారం | - | Sakshi
Sakshi News home page

తనయుడికి ఓటెయ్యాలని తండ్రి ప్రచారం

Published Sat, Nov 11 2023 2:02 AM | Last Updated on Sat, Nov 11 2023 2:02 AM

- - Sakshi

సూర్యాపేట : విద్యుత్‌శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తండ్రి గుంటకండ్ల చంద్రారెడ్డి శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చంద్రారెడ్డి ఎనిమిది పదుల వయస్సులోనూ 18వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నేతలతో కలిసి చంద్రారెడ్డి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సూర్యాపేటలో జగదీష్‌ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement