కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

తాడూరు: కల్తీ మిర్చి విత్తనాలు అంటగట్టి రైతులు నష్టపోయేలా చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. మండలంలోని గుంతకోడూరు మిర్చి రైతులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా అధికారులు కల్తి విత్తనాలపై సమగ్ర విచారణ జరిపించి కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మిర్చి విత్తనాల నాణ్యత లోపించడంతో సాగు చేసి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మిరపకాయ రాకపోవడంలో ఎకరాకు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి నష్టపోయారని ఆరోపించారు. దీనిపై ఒక్క అధికారి కూడా స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో మిరిప పంటను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు శ్యాంసుందర్‌, చాందుపాషా, వెంకట్‌నర్సింహ, నాయకులు శ్రీనివాసులు, రామయ్య, కాశన్న, మధు, వెంకటయ్య, జాఫర్‌ తదితరలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement