ఆదర్శ ‘సహకారం’ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ ‘సహకారం’

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

అందరి సహకారంతోనే సాధ్యం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి.. ప్రతిసారి రుణం తీసుకుంటాం.. రూ.2.50కోట్ల డికార్డిగేటర్‌ ఏర్పాటు

రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యం

● ఉప్పునుంతల పీఏసీఎస్‌కు

అంతర్జాతీయ అవార్డులు

● రైతులకు అందుబాటులో డికార్డిగేటర్‌

● విత్తనం, ధాన్యం కొనుగోళ్ల వరకు

అన్నిరకాల సేవలు

–IIలో u

●

సంఘం అభివృద్ధి అందరి సభ్యుల సమిష్టి కృషితోనే సాధ్యమవుతుంది. ఆదర్శ పీఏసీఎస్‌గా అభివృద్ధి చేయడానికి నాబార్డు, సీడీఎఫ్‌ సహకారంతో పీఏసీఎస్‌కు నూతన భవనం, కొత్తగా గోదాంలు, డికార్డిగేటర్‌ నిర్మించాం. రైతులకు అన్నిరకాల రుణాలు ఇస్తున్నాం. 68శాతం రుణాల రికవరీతో ముందంజలో ఉన్నాం. అందరి సహకారంతో రెండుసార్లు రాష్ట్రస్థాయిలో నాబార్డు అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది.

– కొత్త రవీందర్‌రావు,

సీఈఓ పీఎసీఎస్‌ ఉప్పునుంతల

మాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి. పంట పండించిన తర్వాత ధాన్యం కూడా వారే కొనుగోలు చేస్తున్నారు. రుణాలు క్రమం తప్పకుండా రెన్యూవల్‌ చేస్తున్నాం. పంటలకు బీమాతోపాటు వడ్డీ రాయితీ వస్తుంది. పంట రుణాలతోపాటు గేదెలు, గొర్రెల పెంపకం, కోళ్ల ఫారాలకు లోన్లు ఇస్తున్నారు.

– తేనేటి నారాయణరెడ్డి, రైతు ఉప్పునుంతల

ఇతర బ్యాంకుల వద్దకు రుణం కోసం వెళ్లడానికి మనసుఒప్పకోదు. పీఏసీఎస్‌ మాకు ఇంటిబ్యాంకు మాదిరిగా అనిపిస్తోంది. ప్రతిసారి ఇక్కడే రుణం తీసుకుంటాం. క్రమం తప్పకుండా రెన్యూవల్‌ చేస్తున్నాం.. ఏదైనా అత్యవసరం పడితే బంగారుపై కూడా రుణాలు ఇస్తున్నారు. మాకు అన్నివిధాలుగా రుణ సహాయం అందిస్తున్నారు. – మంగని మనోహర్‌,

రైతు మర్రిపల్లి, ఉప్పునుంతల

అచ్చంపేట/ఉప్పునుంతల: రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఉప్పునుంతల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఈ పీఏసీఎస్‌ ఆదర్శంగా నిలుస్తూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. రైతులకు సకాలంలో రుణాలు అందిండచం మొదలు రికవరీలో ముందుంటూ ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. కేవలం రుణాలకే పరిమితం కాకుండ రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు రైతులు పండించిన వరి, వేరుశెనగ వంటి పంటలను కొనుగోళ్లు చేస్తూ లాబాలబాటలో నడుస్తోంది. పంటల బీమా రైతులకు వర్తించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా అన్ని రకాల సేవలు అందుతుండటంతో పీఏసీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి రైతులు మొగ్గుచూపుతున్నారు.

ఉప్పునుంతల–అచ్చంపేట ప్రధాన రహదారిలో దేవదారికుంట సమీపంలోని గోదాంలో రూ.2.50కోట్లతో డికార్డిగేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎఫ్‌పీఓల భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఉప్పునుంతల రైతు ఉత్పత్తుల సంస్థ ద్వారా రైతులు పడించిన వేరుశెనగ పంటను ఆధునిక వేరుశెనగ డికార్డిగేటర్‌కు తీసుకొచ్చే అవకాశం కల్పించారు. ఎఫ్‌పీఓల ద్వారా సేకరించిన వేరుశెనగను ప్రాసెసింగ్‌ చేసి ప్యాకేజీ, బ్రాండింగ్‌ చేసి అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. రైతులకు దీని ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించనున్నారు. నిల్వ చేసేందుకు అదనంగా పెద్ద గోదాం ఏర్పాటు చేయనున్నారు. త్వరలో పీఏసీఎస్‌ ద్వారా డెయిరీ మిల్స్‌ సెంటర్‌(పాల కొనుగోలు కేంద్రం) ఏర్పాటు చేయనున్నారు. ఆయిల్‌ పాం పడించిన రైతుల కోసం శాశ్వత కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement