సీఎం స్వగ్రామం వద్ద రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సీఎం స్వగ్రామం వద్ద రైతుల ఆందోళన

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

సీఎం స్వగ్రామం వద్ద రైతుల ఆందోళన

కల్వకుర్తి రూరల్‌: డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలంలోని ఇర్విన్‌ గ్రామం వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇర్విన్‌, బైరాపూర్‌ రైతులు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గేటు కమాన్‌ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌ చేపడితే తమ విలువైన భూములు కోల్పోవడంతోపాటు వ్యవసాయం చేయడం కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తిలో నిర్వహిస్తున్న మహా ధర్నాకు వస్తూ సీఎం సొంత గ్రామం వద్ద జేఏసీ నాయకుడు రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమ భూములకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని, భూములు కోల్పోతే జీవనాధారం దెబ్బతింటుందని వాపోయారు. తమ సమస్యకు పరిష్కారం రిజర్వాయర్‌ రద్దు మాత్రమేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యపై వెంటనే స్పందించి రిజర్వాయర్‌ రద్దు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement