కందనూలు: అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల కోసం జిల్లాలోని అర్హులైన వారు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి పాండు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజ సేవ, విద్యాబోధన, వైద్యారోగ్య సేవలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగం, క్రీడలు, వ్యవసాయ రంగాల్లో ప్రతిభకనబరిచిన వారు ఈ పురస్కారాలకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేగీలోగా కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.


