భక్తులచే పది రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరాడు. గణపయ్య.. వెళ్లిరావయ్యా అంటూ భక్తులు ఘన వీడ్కోలు పలికారు. జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి పట్టణంలో గణేశ్ శోభాయాత్ర కనులపండువగా సాగింది. వీధులన్నీ కాషాయమయంగా మారాయి. శోభాయాత్ర పొడవునా యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ.. గణపతిపప్పా మోరియా.. ఆదా లడ్డూ చోరియా అంటూ నినాదాలతో మార్మోగించారు. గణనాథుల ఊరేగింపులో డీజేలు, బ్యాండ్‌మేళాలు, మహిళలు, చిన్నారుల నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్ర అనంతరం చెరువుల్లో గణనాథులను నిమజ్జనం చేశారు.
– కందనూలు/కల్వకుర్తి టౌన్


