అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

తాడూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతోందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తామన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. మొత్తం 45మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, తహసీల్దార్‌ రామకృష్ణయ్య, హౌసింగ్‌ ఏఇ హన్మనాయక్‌, స్థానిక సర్పంచ్‌ మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement