మిగులు సీట్లకు నేరుగా ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

మిగులు సీట్లకు నేరుగా ప్రవేశాలు

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

మన్ననూర్‌: అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని గిరిజన బాలుర గురుకుల జూనియర్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 26న నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపల్‌ సాయిబాబుగౌడ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈసీలో 24, హెచ్‌ఈసీలో 33 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 94909 57314 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

మేలురకం విత్తనాలతో అధిక దిగుబడులు

ఉప్పునుంతల: యాసంగి సీజన్‌లో వేరుశనగ సాగుచేసే రైతులు మేలురకం విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ఉప్పునుంతల పీఏసీఎస్‌ ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఐసీఏఆర్‌– ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్రౌండ్‌నట్‌ రీసెర్చ్‌ (ఐఐజీఆర్‌) కింద 100 మంది రైతులకు గిర్నార్‌–4 వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. అంతకముందు శాస్త్రవేత్తలు క్షేత్ర ప్రదర్శనలో భాగంగా పంటసాగు, దిగుబడిపై అవగాహన కల్పించారు. మేలురకం వేరుశనగ విత్తనం సాగు, యాజమాన్య పద్ధతులను వివరించారు. విత్తనం వేసింది మొదలు.. పంట పూర్తయ్యే వరకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మడ్డు నరేందర్‌రెడ్డి, సీఈఓ రవీందర్‌రావు, డైరెక్టర్లు సూరం నారాయణ్‌రెడ్డి, సాయిబాబు, పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు డా.శశిభూషణం, డా.శోభ, ఐఐజీఆర్‌ జునాగఢ్‌ టెక్నికల్‌ సిబ్బంది దేవ్‌కాంత్‌సింగ్‌, అనంతపురం టెక్నికల్‌ సిబ్బంది మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం

అచ్చంపేట: నల్లమలలో విద్యుత్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి సబ్‌స్టేషన్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో,గ్రామాల్లో వీధి దీపాలు నిరంతరం వెలగకుండా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. అవసరమైన విద్యుత్‌ మరమ్మతు, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నుంచి రూ.7 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. విద్యుత్‌ సరఫరా, వీధి దీపాల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం అచ్చంపేట వై జంక్షన్‌, పార్కుతో పాటు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అచ్చంపేట మండలంలో 29 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరయ్యాయన్నారు. అనంతరం బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రజా భవన్‌లో నియోజకవర్గంలోని విఽవిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాప్రా, ఎంపీడీఓ అరుంధర్‌రావు, డీఎల్‌పీఓ వెంకటప్రసాద్‌, తహసీల్దార్‌ సైదులు తదితరులు పాల్గొన్నారు. ఎ.గోపాల్‌రెడ్డి, నర్సయ్యయాదవ్‌, ఎం.రామనాథం, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే

ప్రభుత్వ లక్ష్యం

అమరచింత: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. ప్రతిపక్షాలు రైతుల పేరిట రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ కేశం నాగరాజ్‌గౌడ్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం జూరాల ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల సాగునీటి సమస్యలను మంత్రి వాకిటి శ్రీహరి సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కర్ణాటక సీఎంతో మాట్లాడి ఎగువ నుంచి నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. బీఆర్‌ఎస్‌, బీజేపీల లేనిపోని ఆరోపణలు రైతులు నమ్మొద్దని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement