గిరాకీ తగ్గింది..
చిన్నారుల కోసం ప్రత్యేకంగా..
నేడు ‘రాఖీ’ పౌర్ణమి వేడుకలు
ఆత్మీయుల కలయిక..
ఆనందంగా జరుపు కొంటాం..
సరిపోని బస్సులు
రాఖీ పండుగ నేపథ్యంలో గురువారం మహబూబ్‌నగర్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
–9లో u
●
హిందూ సంప్రదాయంలో అనుబంధాలు, ఆప్యాయతలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే రాఖీ పండుగ వచ్చిందంటే ఊరు, వాడ అంతా సందడే. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ జరుపుకొనే ఈ పండుగకు మార్కెట్లు, దుకాణాలు సందడిగా మారాయి. గత మూడు రోజుల నుంచే జిల్లాకేంద్రంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, నల్లవెల్లి రోడ్, శ్రీపురం చౌరస్తాలతోపాటు ప్రధాన పట్టణాలు, గ్రామాల్లోని దుకాణాల్లోనూ రాఖీల అమ్మకాల జోరు కొనసాగుతుంది. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు ఆకృతుల్లో రాఖీలను అందుబాటులో ఉంచారు.
ఆధునిక కాలంలోనూ ఆదరణ తగ్గని రాఖీ పండుగ
ఎక్కడున్నా తమవారికి రాఖీలు
పంపి.. సంబురం
సోషల్ మీడియాలోనూ
శుభాకాంక్షల వెల్లువ
అప్యాయత, అనురాగాలను
చాటే ‘రక్షా’నుబంధం
చిన్నారులకు రాఖీ పండుగ అంటే మరీ సరదా. అక్క, చెల్లిని అడిగి మరీ రాఖీ కట్టించుకుంటారు. దీంతో చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగా బాల గణేష్, భీమ్, బెన్‌టెన్, మిక్కీమౌస్ లాంటి బొమ్మల రాఖీలు ఉన్నాయి. రంగురంగుల లైట్లు వెలుగుతూ అందంగా కనిపించే రాఖీలు సైతం పిల్లల కోసం కొనుగోలు చేస్తుంటారు.
సోదర, సోదరీమణులు ఉత్సాహంగా జరుపుకొనేదే రాఖీ పండుగ. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. ప్రతి ఏడాది అందరం కలిసి మా ఊరెళ్లి అన్నా, తమ్ముడికి రాఖీ కడుతాం. ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకొంటాం. – శాంతమ్మ, పెద్దకొత్తపల్లి
ఈ ఏడాది రాఖీ గిరాఖీలు పెద్దగా లేవు. వర్షాలు పడక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కొనుగోలు చేయాలని ఆలోచన ఉన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నారు. మొత్తంగా గతేడాది కంటే ఈసారి గిరాకీ బాగా తగ్గిందనే చెప్పాలి.
– సురేందర్‌రావు,
వ్యాపారి, నాగర్‌కర్నూల్


