
టాస్క్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కల్వకుర్తి రూరల్: నిరుద్యోగ యువతకు స్కిల్స్ నేర్పించేందుకు టాస్క్ ఆధ్వర్యంలో పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తదితరులు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరం, ఐటీఐ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. వీటన్నింటిలో ఐటీఐ ప్రాంగణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ ఐటీఐతో పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో రూ.1.50 కోట్ల అంచనాతో 4 అంతస్తుల్లో నిర్మించే సెంటర్‌లో ప్లేస్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, ఫండమెంటల్ స్కిల్స్, జావా, పైథాన్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు సుంకిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వివరించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కల్వకుర్తిలో ఐటీ టవర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. టీ హబ్, వీ హబ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని సీఈఓ చెప్పారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జయమ్మ విజ్ఞప్తి మేరకు కళాశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రాఘవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షానవాజ్ ఖాన్, అధికారులు ఉన్నారు.
అగ్నివీర్‌కు దరఖాస్తు ఆహ్వానం
కందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లాలోని యువత భారత వైమానిక దళం అగ్నివీర్‌లో చేరేందుకు ఆసక్తి గలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై ఉండి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని htt p//agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 78391 26939, 63002 95901 నంబర్లను సంప్రదించాలని కోరారు.
56 ‘మీసేవ’
నిర్వాహకులపై చర్యలు
నాగర్‌కర్నూల్: నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్న జిల్లాలోని 56 మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 128 మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకంగా పని చేయాల్సిన మీసేవ కేంద్రాలు నిబంధన లు అతిక్రమించి రైతులు, ప్రజలు, విద్యార్థుల నుంచి అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కేంద్రాలు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి అధిక వ సూళ్లకు పాల్పడుతున్నట్లు తమ వద్ద సమాచా రం ఉందన్నారు. జిల్లాలో 26 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, మరిన్ని ఆధార్ కేంద్రాలు నెలకొల్పేందుకు మీసేవల నుంచి దరఖాస్తుల కోరుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఈ డిస్ట్రిక్ మేనేజర్ నరేష్, మీసేవ కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
నాగర్‌కర్నూల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, రూ.18వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్ అమలు చే యాలని ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట సోమ వారం ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా వైద్యధికారి డీఎంహెచ్‌ఓ రవికుమార్‌కు సమ స్యలతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆర్ శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, శంకర్‌నాయక్, అంతటి కాశన్న, కళావతి, చెన్నమ్మ, వసుందర పాల్గొన్నారు.

టాస్క్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన

టాస్క్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన