
మట్టి గణపతులను పూజిద్దాం
నాగర్‌కర్నూల్: వినాయక చవితి కోట్లాది మంది భక్తులను ఒకచోట చేర్చుతుందని, ఈ సందర్భంగా మట్టి గణనాథులను ప్రతిష్ఠించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దామని కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జిల్లా పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతులను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి గణపతులను మాత్రమే పూజిద్దామని కోరారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. మట్టి అయితే నీటిలో సులభంగా కరుగుతుందని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు, వాటిపై ఉపయోగించే రసాయనిక రంగులు నీటిలో కరుగుతూ నదులు, చెరువులు, కాల్వలు, బావులు వంటి నీటి వనరులను కలుషితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జలచర జీవులకు ప్రాణసంకటంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ దివ్య, బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
జిల్లావ్యాప్తంగ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను అధికారులు వేగంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన 39 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం వాటిని ఆయా అధికారులకు కేటాయించారు.
కలెక్టర్ బదావత్ సంతోష్,