
జటప్రోల్ ఆలయాల అభివృద్ధికి కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
● రూ.4.8 కోట్లతో అభివృద్ధి
పనులకు శంకుస్థాపన
పెంట్లవెల్లి: దశాబ్దాల దీప, ధూప, నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని జటప్రోల్ గ్రామంలో పురాతనమైన మధనగోపాలస్వామి, అగస్తేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఆలయ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న జటప్రోల్ గ్రామ ప్రజల ఆశ త్వరలోనే నెరవేరబోతుందన్నారు. రూ.3.80 కోట్ల వ్యయంతో మధనగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక గదులు, కోనేరు పార్కు, కళావేదిక వంటివి నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులు, కళాకారులు ప్రతిరోజు నాట్య ప్రదర్శన చేయడానికి ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతిరోజు దీప, ధూప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని అర్చకులకు సూచించారు. అనంతరం జటప్రోల్‌లో పునర్నిర్మించిన అగస్తేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సైతం రూ.కోటి వెచ్చించడం జరిగిందని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి అభివృద్ధి పనులను నాణ్యతగా, వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సురభీ రాజావంశస్థులు ఆదిత్య లక్ష్మణరావు, ఆర్డీఓ భన్సీలాల్, నాయకులు గోవింద్‌గౌడ్, రామన్‌గౌడ్, నర్సింహయాదవ్, గోపాల్, గోపినాయక్, నాగిరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.