
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
కొల్లాపూర్/కందనూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపికచేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. నాల్గో వార్డులో స్థానికుల సమక్షంలో 20మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లను మంత్రి చదివి వినిపించారు. వారిలో నలుగురు అనర్హులని స్థానికులు చెప్పడంతో.. వారి పేర్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ గురుకుల పాఠశాలను మంత్రి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు. కుటుంబంపై బెంగ పెట్టుకున్న విద్యార్థుల కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడించారు. చదువు ఆవశ్యకతను ఆయన విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
● జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం–327 ఐఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలని కోరారు.
అనర్హులను ఎంపికచేస్తే చర్యలు తప్పవు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు