
‘రంగసముద్రం’ నీటిని వదలాలి
వనపర్తి రూరల్: రంగసముద్రం రిజర్వాయర్ నుంచి భీమా కాల్వ ద్వారా వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. సాగునీరు విడుదల చేయడం లేదని ఆయా మండలాల రైతులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో బుధవారం ఆయన శ్రీరంగాపురంలోని రంగ సముద్రం జలాశయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ సాగునీరు ఎందుకు వదలడం లేదని అధికారులను ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని.. రోజువారీగా ఎంత నీరు విడుదల చేస్తున్నారో లాగ్‌బుక్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ కేశవరావు, డీఈలు కిరణ్‌కుమార్, రాజ్‌కుమార్, ఏఈఈ వినయ్‌కుమార్, ఏఈ అక్షయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు