ప్రజారోగ్యం పట్టదా..? | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం పట్టదా..?

Aug 2 2025 11:15 AM | Updated on Aug 2 2025 11:15 AM

ప్రజా

ప్రజారోగ్యం పట్టదా..?

అచ్చంపేట రూరల్‌: మున్సిపాలిటీల్లో సీజనల్‌ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులను నయం చేసుకోవడానికి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అచ్చంపేట పట్టణంలో 20 వార్డులు ఉండగా పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు మొక్కుబడి చర్యలు చేపడుతున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయినా వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికితోడు మున్సిపల్‌ పరిధిలో ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆయా కాలనీల ప్రజలు జ్వరాలతోపాటు వివిధ రకాల జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నా.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లినా.. కనీసం వాసన కూడా రావడం లేదంటున్నారు. దీంతో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.

నామమాత్రంగా ఫాగింగ్‌..

మున్సిపల్‌ పరిధిలో రెండు ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో కాలనీల్లో దోమల నివారణ కోసం ఫాంగింగ్‌ చేపట్టాల్సి ఉండగా.. ఒక్క యంత్రంతోనే నెట్టుకొస్తున్నారు. అదికూడా నామమాత్రంగానే ఫాగింగ్‌ చేస్తున్నారని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముసురు వర్షానికి దోమలు వృద్ధి చెంది ఇళ్లలోకి వస్తున్నాయని, దీంతో దోమకాటు వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం జ్వరాల తీవ్రత పెరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. చాలా ఏళ్ల కిందట ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేయడం, ఆధునిక సాంకేతిక పద్ధతులపై మున్సిపల్‌ అధికారులు ఆలోచన చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో పెరిగిన జనాభా దృష్ట్యా మరికొన్ని యంత్రాలను కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయా కాలనీల ప్రజలు మున్సిపల్‌ అధికారులకు ఫోన్లు చేస్తేనే ఫాగింగ్‌ చేస్తున్నారని, బాధ్య తగా పని చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత..

ప్రజారోగ్యానికి కొంత నిధులను వెచ్చిస్తున్నా.. ఆ స్థాయిలో వసతులు సమకూర్చడం లేదు. ఫలితంగా నిధులు వృథా అవుతున్నాయి. ఫాగింగ్‌ చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది అంటూ లేరు. పారిశుద్ధ్య పనులు చేయించే వారితోనే ఫాగింగ్‌ చేయిస్తున్నారు. దీనికితోడు దోమల నిర్మూలన కోసం ప్రస్తుతం ఫాగింగ్‌, యాంటీ లార్వా పిచికారీ వంటి సంప్రదాయ పద్ధతులనే అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏఐ ఆధారిత సెన్సార్లతో దోమల ఉత్పత్తి, సాంధ్రతను గుర్తించి డ్రోన్ల సాయంతో మందు పిచికారీ చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజారోగ్యం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చర్యలు చేపడతాం..

అచ్చంపేట మున్సిపల్‌ కార్యాలయంలో రెండు ఫాగింగ్‌ యంత్రాలు ఉండగా.. ఒకటి మరమ్మతుకు గురైంది. దీంతో ఒక్క యంత్రంతోనే ఆయా కాలనీల్లో ఫాగింగ్‌ చేస్తున్నాం. అలాగే పట్టణంలోని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఆ దిశగా చర్యలు చేపడుతాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

– మురళి, మున్సిపల్‌ కమిషనర్‌, అచ్చంపేట

సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్న పట్టణ ప్రజలు

దోమల విజృంభణతో ఇబ్బందులు

మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్న యంత్రాంగం

ఆధునిక సాంకేతిక పద్ధతులపై దృష్టిసారించని అధికారులు

ప్రజారోగ్యం పట్టదా..? 1
1/2

ప్రజారోగ్యం పట్టదా..?

ప్రజారోగ్యం పట్టదా..? 2
2/2

ప్రజారోగ్యం పట్టదా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement