
ఏసీబీ వలలో భూత్పూర్ ఏఆర్‌ఐ
భూత్పూర్: మండల అసిస్టెంట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్‌ఐ) బాలసుబ్రమణ్యం రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కప్పెట గ్రామానికి చెందిన వ్యక్తి సాకలి ఆంజనేయులు తన చెల్లికి ఇటీవల పెళ్లి చేశాడు. అయితే కల్యాణలక్ష్మి పత్రాల ఎంకై ్వరీ కోసం ఎంఆర్‌ఐ బాలసుబ్రమణ్యం మొదట రూ.8 వేల లంచం డిమాండ్ చేసి.. తర్వాత రూ.4 వేలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం ఏఆర్‌ఐ బాలసుబ్రమణ్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ.. మార్గమధ్యంలో సాకలి ఆంజనేయులు నుంచి రూ.4 వేలు డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ఏఆర్‌ఐ బాలసుబ్రమణ్యంను తీసుకొచ్చి విచారించారు. అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు.
రూ.4 వేలు లంచం తీసుకుంటూ
పట్టుబడిన వైనం