రహదారులకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

రహదారులకు మహర్దశ

Jul 31 2025 8:59 AM | Updated on Jul 31 2025 8:59 AM

రహదార

రహదారులకు మహర్దశ

ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్‌ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్‌లో వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్‌ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది.

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో..

జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్‌ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్‌, కౌకుంట్ల, శ్రీనగర్‌, కొరివిపాడు, బొంకూర్‌)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్‌ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు.

● మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్‌నగర్‌– మంగనూర్‌ రోడ్డు, మహబూబ్‌నగర్‌– నవాబుపేట రోడ్డు, వేపూర్‌ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్‌పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్‌ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్‌– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్‌కొండ రోడ్డు వయా మల్కాపూర్‌, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్‌– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్‌– తిరుమలాపూర్‌, మరికల్‌– మిన్సాపూర్‌ రోడ్డు, మక్తల్‌– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు.

వనపర్తి సర్కిల్‌ పరిధిలో..

వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు– నాగర్‌కర్నూల్‌ వయా గోదల్‌, తుమ్మన్‌పేట్‌, అచ్చంపేట– రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి– వనపర్తి వయా శ్రీరంగాపూర్‌, అమ్రాబాద్‌– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి– ఆత్మకూర్‌, ఆత్మకూర్‌– మరికల్‌ రోడ్డు, వనపర్తి– బుద్దారం రోడ్డు, చిన్నంబావి– చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలాగే బల్మూర్‌– నాగర్‌కర్నూల్‌ వయా గోదల్‌, తుమ్మన్‌పేట్‌ రోడ్డు, అచ్చంపేట– రాకొండ, పెంట్లవెల్లి– వనపర్తి రోడ్లను డబుల్‌గా విస్తరించనున్నారు.

నిధులు మంజూరయ్యాయి..

ఉమ్మడి జిల్లాలోని రెండు ఆర్‌అండ్‌బీ సర్కిళ్ల పరిధిలో రోడ్ల విస్తరణ, బలోపేతం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైబ్రిడ్‌ ఆన్యూటీ పద్ధతిలో ఈ పనులను త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రధానమైన రోడ్లకు డబుల్‌ లేన్లు, మిగతా రోడ్లను బలోపేతం చేసేందుకు త్వరలోనే పనులు మొదలవుతాయి.

– దేశ్యానాయక్‌,

ఆర్‌అండ్‌బీ ఈఈ, నాగర్‌కర్నూల్‌

మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల

నిర్మాణానికి రూ.434 కోట్లు

వనపర్తి సర్కిల్‌లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు

హైబ్రిడ్‌ యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు

జిల్లాలు, మండలాలు, గ్రామాల

కనెక్టింగ్‌ రోడ్లకు ప్రాధాన్యం

రహదారులకు మహర్దశ 1
1/1

రహదారులకు మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement