
అసౌకర్యాల ‘వసతి’
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలలు విద్యార్థులకు కాకుండా అసౌకర్యాలకు వసతి కల్పిస్తున్నట్లుగా మారాయి. విద్యార్థులకు కనీసం మెనూ ప్రకారం భోజనం కూడా అందకపోవడం అస్తవ్యస్త నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. మంగళవారం ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ, సాంబర్ బదులుగా చాలాచోట్ల లెమన్ రైస్, కిచిడీ వడ్డిస్తున్నారు. దీనికితోడు నాసిరకం సరుకులతో వంట చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన పరిశీలనలో దుర్భర పరిస్థితులు వెలుగుచూశాయి.
జిల్లాలో అస్తవ్యస్తంగా సంక్షేమ గురుకుల హాస్టళ్ల నిర్వహణ
● మెనూ నిర్వహణలో కనిపించని సమయపాలన
● నాసిరకం సరుకులతో వంటలు..
వంట గదుల్లో పరిశుభ్రత కరువు
● టాయిలెట్లు, దుప్పట్లు లేక
విద్యార్థుల ఇబ్బందులు
● అధికారుల తీరులో మార్పు తేని
ఉయ్యాలవాడ ఘటన
● ‘సాక్షి’ విజిట్‌లో బయటపడిన దుర్భర పరిస్థితులు