‘రామప్ప’ను సందర్శించిన 14 దేశాల ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

‘రామప్ప’ను సందర్శించిన 14 దేశాల ప్రతినిధులు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఆంటిగ్వా, బార్బుడా, బంగ్లాదేశ్‌, బోట్స్వానా, ఈజిప్ట్‌, ఇరాన్‌, లెబనాన్‌, లైబీరియా, మాల్దీవులు, మాలి, మారిషస్‌ నైజీరియా, సిరియా, టాంజానియా, జింబాబ్వే తదితర 14 దేశాల నుంచి 25 మంది ప్రతినిధులు, అధికారులు భారత్‌ దర్శన్‌లో భాగంగా రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్‌ శర్మ, ఉమాశంకర్‌ వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారికి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ కాకతీయల చరిత్ర, ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్‌ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్‌, ఎంపీడీఓ రాజు, ఆర్‌ ఐ రమేష్‌, జీపీఓ సూరయ్య, ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులు, టూరిస్ట్‌ పోలీసులు బద్రు, శ్రీనివాస్‌, అరుణ్‌, శ్రీకాంత్‌, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.

రామప్పను సందర్శించిన భూపాలపల్లి కలెక్టర్‌

మండలంలోని పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని శుక్రవారం భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రామ ప్ప రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీష్‌ శర్మ, ఉమాశంకర్‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా రామప్పను సందర్శించడానికి వచ్చిన మంత్రి సీతక్క కలెక్టర్‌ రాహుల్‌ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement