రామప్పలో సండే సందడి | - | Sakshi
Sakshi News home page

రామప్పలో సండే సందడి

Nov 2 2026 1:05 AM | Updated on Nov 2 2026 1:05 AM

సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ

మల్లూరులో గల హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన తిల తైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. – మంగపేట

మండల పరిధిలోని రామప్ప దేవాలయంలో సండే సందడి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 30మంది సీనియర్‌ సిటిజన్స్‌ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారికి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్‌ చేసి సందడిగా గడిపారు. వారి వెంట ఈవో ఇమ్మడి భాస్కర్‌, టూరిస్ట్‌ పోలీసులు శ్రీనివాస్‌, భద్రు, శ్రీకాంత్‌, పురావస్తు, దేవాదాయశాఖ, టూరిజం శాఖ సిబ్బంది పాల్గొన్నారు. – వెంకటాపురం (ఎం)

మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం చేరుకున్న భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, గాజులు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. – ఎస్‌ఎస్‌ తాడ్వాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement