ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని లింగాల గ్రామ పంచాయతీలో మద్యపానాన్ని నిషేధించేందుకు గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లింగాల గ్రామపంచాయతీ అధికారులు గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ నెల 5వ తేదీ నుంచి లింగాల గ్రామపంచాయతీ పరిధిలో మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యపానం వల్ల కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామ పరిధిలో మద్యం తయారీ, నిల్వ, విక్రయాలు, బహిరంగంగా మద్యపానం చేయడాన్ని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 5వ నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.50 వేల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలోని దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల్లో మద్యం విక్రయించరాదని స్పష్టం చేశారు. మద్యపాన రహిత గ్రామమే లక్ష్యంగా గ్రామాన్ని మద్యపాన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పంచాయతీ అధికారులు కోరారు.
ఈ నెల 5వ తేదీ నుంచి అమలు
జీపీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం


