మోడల్‌ స్కూళ్లలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూళ్లలో నియామకాలు

Nov 2 2026 1:05 AM | Updated on Nov 2 2026 1:05 AM

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తెలంగాణ మోడల్‌ స్కూళ్లల్లో నాలుగు కేటగిరీల పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ మోడల్‌ స్కూల్‌లో ఆర్ట్‌, యోగా, కంప్యూటర్‌ టీచర్లతో పాటు లైబ్రేరియన్‌ పోస్టులు కూడా భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఐదు నెలల కాలపరిమితికిగాను (నవంబర్‌ 1నుంచి మార్చి 31వరకు) ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోని మోడల్‌ స్కూళ్లలో పోస్టులు భర్తీ చేయనున్నారు. కంప్యూటర్‌ టీచర్‌, లైబ్రేరియన్‌ ఆర్ట్‌, యోగా టీచర్లను నియమించనున్నారు.

కలెక్టర్లకు, డీఈఓలకు

ఆదేశాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కలెక్టర్లు, డీఈఓలకు తమ జిల్లాలోని మోడల్‌ స్కూళ్లలో అర్హులైన ఆయా సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా నియమించుకునేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. నియామకాలు విద్యార్హతలు, వయో పరిమితి, వేతనం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. సంబంధిత జిల్లాల డీఈఓలు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది.

ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీకి అవకాశం

నవంబర్‌ 1 నుంచి 5 నెలల ఉద్యోగ కాలపరిమితి

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement